Hanuman Chalisa (Tulsidas) - హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం) - All Lyrics Hunt

 Hanuman Chalisa (Tulsidas) - హనుమాన్ చాలీసా (తులసీదాస కృతం)

1.తెలుగు హనుమాన్ చాలీసా

Hanuman Chalisa in Telugu

  • హనుమాన్ చాలీసా గోస్వామి తులసీదాస్ హనుమంతుని దర్శనంతో హనుమంతుని స్తుతిస్తూ పాడిన స్తోత్రము.
  • ఈ స్తోత్రాన్ని మంగళ, శని, గురు వారాలలో ఉదయం మరియు రాత్రి వేళలో చదవడం మంచిది.
  • హనుమాన్ చాలీసాను శని ప్రభావం ఉన్నవారు పఠించడం వాళ్ళ అన్ని రకాల శని దోషాలు తొలగిపోతాయి.
  • దీనిని తరుచుగా చదవటం వల్ల శరీర అస్వస్థత, దీర్ఘ కాలిక వ్యాధులు తొలగి దృష్ట శక్తుల ప్రభావం పోతుంది.
  • హనుమాన్ చాలీసాను శ్రద్ధతో పఠించటం వల్ల ఆర్థిక సంబంధిత సమస్యలు తొలగి మనశ్శాంతి, మనోబలం పెరుగుతాయి.
  • విపత్తు సమయాలలో, శుభ ముహుర్తాలలో (మృగశిర నక్షత్రం రోజుల్లో) 108 సార్లు, రోజూ 11 సార్లు చదవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
  • హనుమాన్ చాలీసా యొక్క మహత్యం, చరిత్ర క్రింద ఇవ్వబడింది, చదివి తెలుసుకోండి.

2. హనుమాన్ చాలీసా తెలుగులో

Hanuman Chalisa Lyrics in Telugu

hanuman-chalisa-telugu-lyrics


3. హనుమాన్ చాలీసా తెలుగులో

హనుమాన్ చాలీసా
॥ దోహా- ॥
శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార ।
బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ॥

బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార ॥
॥ చౌపాయీ- ॥
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహుం లోక ఉజాగర ॥౧॥

రామ దూత అతులిత బల ధామా ।
అంజనిపుత్ర పవనసుత నామా ॥౨॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥౩॥

కంచన బరన విరాజ సువేసా ।
కానన కుండల కుంచిత కేశా ॥౪॥

హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై ।
కాంధే మూంజ జనేఊ సాజై ॥౫॥

సంకర సువన కేసరీనందన ।
తేజ ప్రతాప మహా జగ వందన ॥౬॥

విద్యావాన గుణీ అతిచాతుర ।
రామ కాజ కరిబే కో ఆతుర ॥౭॥

ప్రభు చరిత్ర సునిబే కో రసియా ।
రామ లఖన సీతా మన బసియా ॥౮॥

సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా ।
వికట రూప ధరి లంక జరావా ॥౯॥

భీమ రూప ధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥౧౦॥

లాయ సజీవన లఖన జియాయే ।
శ్రీరఘువీర హరషి ఉర లాయే ॥౧౧॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥౧౨॥

సహస వదన తుమ్హరో యస గావైఁ ।
అస కహి శ్రీపతి కంఠ లగావైఁ ॥౧౩॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥౧౪॥

యమ కుబేర దిక్పాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥౧౫॥

తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా ।
రామ మిలాయ రాజ పద దీన్హా ॥౧౬॥

తుమ్హరో మంత్ర విభీషన మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా॥౧౭॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥౧౮॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీఁ ॥౧౯॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥౨౦॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥౨౧॥

సబ సుఖ లహై తుమ్హారీ సరనా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥౨౨॥

ఆపన తేజ సంహారో ఆపై ।
తీనోఁ లోక హాంక తేఁ కాంపై ॥౨౩॥

భూత పిశాచ నికట నహిఁ ఆవై ।
మహావీర జబ నామ సునావై ॥౨౪॥

నాశై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥౨౫॥

సంకటసే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥౨౬॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తిన కే కాజ సకల తుమ సాజా ॥౨౭॥

ఔర మనోరథ జో కోయీ లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥౨౮॥

చారోఁ యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥౨౯॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥౩౦॥

అష్ట సిద్ధి నవ నిధి కే దాతా ।
అస బర దీన జానకీ మాతా ॥౩౧॥

రామ రసాయన తుమ్హరే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥౩౨॥

తుమ్హరే భజన రామ కో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥౩౩॥

అంత కాల రఘుపతి పుర జాయీ ।
జహాఁ జన్మి హరిభక్త కహాయీ ॥౩౪॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥౩౫॥

సంకట కటై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బలవీరా ॥౩౬॥

జై జై జై హనుమాన గోసాయీఁ ।
కృపా కరహు గురు దేవ కీ నాయీఁ ॥౩౭॥

యహ శత బార పాఠ కర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥౩౮॥

జో యహ పఢై హనుమాన చలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ॥౩౯॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥౪౦॥
॥ దోహా- ॥
పవనతనయ సంకట హరణ ।
మంగల మూరతి రూప ॥
రామ లఖన సీతా సహిత ।
హృదయ బసహు సుర భూప ॥


4. హనుమాన్ చాలీసా యొక్క మహత్యం, చరిత్ర క్రింద ఇవ్వబడింది, చదివి తెలుసుకోండి.

హనుమాన్ చాలీసా చరిత్ర / మహత్యం

History and Improtance of hanuman chalisa in telugu

                  ఒక రోజు తులసీదాస్ నది వొడ్డున ఉన్న చెట్టు కింద రాముని ధ్యానంలో ఉన్నాడు. అదే పట్టణంలో ఒక వ్యక్తి మరణించాడు. అతడి అంత్య క్రియలు జరుగుతుండగా అతని భార్య చెట్టు క్రింద కూర్చొని వున్నతులసీదాసుని గమనించి అతని దగ్గరకు వొచ్చింది. తులసీదాసు ఆమెను చూసి దీర్ఘసుమంగళీభవ అని అంటాడు. అప్పుడు ఆమె “నా భర్త మరణించాడు మీరు ఇలా ఆశీర్వదిస్తున్నారు” అని అంటుంది. అప్పుడు తులసీదాసు అదేంటి రాముడు నాతో నిజమే చెప్పిస్తాడు అని అంటాడు. తులసీదాసు తన కలశంలోని నీటిని ఆ వ్యక్తిపై చల్లుతాడు. దానితో ఆ వ్యకి మళ్ళీ బ్రతుకుతాడు. దీనితో అందరూ ఆశ్చ్యర్య పోతారు.

                   ఈ విషయం చివరకు వారణాసి పట్టణ రాజు అక్బరు బాదుషాకు తెలిసి తులసీదాసుని ఆస్థానానికి పిలిపిస్తాడు. తులసీదాసుని అతను చేసిన మహిమలను మళ్ళీ ప్రదర్శించమటాడు. దానికి తులసీదాసు అందులో తన మహిమలు ఏవీ లేవని అంతా ఆ రాముని కృప అని అంటాడు. దీనితో రాజుకి కోపం వొచ్చి రాజభటులకి తులసీదాసుని కొరడాలతో కొట్టమని ఆదేశిస్తాడు. దీనిని గమనించిన హనుమంతుడు కోతుల సమూహాలతో రాజభటులపై దాడి చేస్తాడు. దీనిని గ్రహించిన తులసిదాసు హనుమంతుని స్తుతిస్తూ స్తోత్రాన్ని పాడుతాడు. ఆ స్తోత్రమే హనుమాన్ చాలీసా. ఆంజనేయుడు తులసీదాసు స్తోత్రానికి మెచ్చి ఈ స్తోత్రాన్ని పఠించినవారికి తాను తోడు ఉండి వారి కష్టాలను దూరం చేస్తానని చెపుతాడు.






Post a Comment

0 Comments